విశాఖ జిల్లా చీడికాడ మండలం అప్పలరాజుపురంలో రక్షిత మంచినీటి కుళాయిల గొట్టాలు పగిలిపోవటంతో తాగునీటికి గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. గొట్టాలు పగిలిన ప్రాంతంలో మరమ్మతుల కోసం గొయ్యిలు తీసి నాలుగు రోజులు గడుస్తున్నా, అధికారులు దాన్ని పట్టించుకోవటం మానేశారు. దీంతో మహిళలు తాగునీటి కోసం చేతి బోర్లపై ఆధారపడినా, అవి కూడా అంతంత మాత్రంగా పని చేయటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి నీటి సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పైపులు బాగు చేయరు...నీళ్లు రావు
రక్షిత మంచినీటి కుళాయిలు పాడై నాలుగు రోజుల గడుస్తున్నా అధికారులు స్పందించకపోవటంతో విశాఖ జిల్లా చీడికాడ మండలంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
పైపులు బాగు చేయరు...నీరు రాదు...