విశాఖ జిల్లా చీడికాడ మండలం రెల్లలపాలెంలో గిరిజన మహిళలు తాగునీటి కోసం బిందెలతో నిరసన చేపట్టారు. దాహార్తిని తీర్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించడం లేదని మైదాన గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి అర కిలోమీటర్ దూరంలోని బావి నుంచి రోజూ తాగునీరు మోస్తూ..మహిళలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
బావి నుంచి గ్రామానికి పైపులైన్, కుళాయిలు ఏర్పాటు చేయాలని బిందెలతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని ఆదివాసులు కోరుతున్నారు.