ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బోరింగ్ లోకి ఉబికి వస్తోన్న నీరు...!

By

Published : Aug 10, 2019, 4:57 PM IST

కొట్టకుండానే బోరు నుంచి నీరు వచ్చేస్తుంది. నమ్మకపోతే ఆంధ్రా-ఒడిశా సరిహద్దు రాయగడ జిల్లాకు వెళ్లాల్సిందే...!

బోరు కొట్టకుండానే నీరు...!

బోరు కొట్టకుండానే నీరు...!

ఇటీవల ఎడతెరిపి లేకుండా కురస్తున్న వర్షాలతో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరుగుతోంది. ఎంతలా పెరుగుతుందంటే, బోరింగ్ కొట్టకపోయినా బోరులో నుంచి నీళ్లు ఉబికి పైకి వచ్చేస్తున్నాయి. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో రాయగడ జిల్లా తడమా పంచాయతీ బంజిలి గ్రామంలో బోర్లు కొట్టకుండానే నీరు బయటకు రావడంతో ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. భూగర్భ జలాలు ఎక్కువైనప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. ఇరవై రోజుల తర్వాత మామూలు స్థితికి బోరింగ్ వచ్చేస్తుందని వారు చెబుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details