ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రమాద స్థాయిలో తాండవ జలాశయం నీటి మట్టం

By

Published : Sep 14, 2020, 12:53 PM IST

కొద్ది రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు విశాఖ జిల్లా తాండవ జలాశయంలో నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. దీంతో త్వరలోనే గేట్లు ఎత్తి అదనపు నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈమేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

water at risk level in Thandava Reservoir
ప్రమాద స్థాయిలో తాండవ జలాశయం నీటి మట్టం

విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయంలో నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున నీరు జలాశయానికి వచ్చి చేరింది. దీంతో జలాశయం నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. త్వరలోనే గేట్లు ఎత్తి అదనపు నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా సోమవారం ఉదయానికి 380 అడుగులకు చేరుకున్నట్టు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అధికారులు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details