చీడికాడ మండలం కోనాం జలాశయంలోని నీరు రెండు రంగుల్లో కనిపిస్తోంది. జలాశయంలో ఉన్న నీరు ఆకుపచ్చగా ఉండగా... ఎగువ నుంచి వచ్చిన వరద నీరు మరో రంగులో కనిపించింది.
ఇలా.. రెండు రంగుల్లోకి మారిన నీరు చూపరులను ఎంతో ఆకట్టుకుంటోంది. జలాశయ సందర్శనకు వచ్చిన పర్యటకులు ఈ దృశ్యాలను తమ చరవాణుల్లో బంధిస్తూ ముచ్చటపడుతున్నారు.