విశాఖ కలెక్టరేట్ వద్ద వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసనబాట పట్టారు. మున్సిపల్ అధికారులు.. వార్డు సచివాలయ, పర్యావరణ కార్యదర్శులకు సంబంధంలేని ఉద్యోగ బాధ్యతలు అప్పగించి బలవంతంగా చేయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామన్నారు. పని భారంతో సక్రమంగా విధులు నిర్వర్తించలేకపోతున్నామని పేర్కొన్నారు. అధికారులు స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని.. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.
విశాఖలో వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసన - ఏపీ సచివాలయ ఉద్యోగుల నిరసన
సంబంధంలేని ఉద్యోగ బాధ్యతలు అప్పగించి బలవంతంగా చేయిస్తున్నారని వార్డు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు విశాఖ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.

విశాఖలో వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసన