ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టిక్కెట్‌ లేని ప్రయాణికులకు రూ.2.05 కోట్ల జరిమానా.. - ap news

తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్‌ డివిజన్‌లో గతేడాది డిసెంబరు నెలలో టిక్కెట్‌ లేని ప్రయాణికుల నుంచి రూ.2.05 కోట్ల మేర అపరాధ రుసుము వసూలు చేసినట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఐదు ప్రత్యేక బృందాలు, ఇతర సిబ్బంది శ్రమించి టిక్కెట్లు లేని ప్రయాణికులను గుర్తించి 35,342 కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

train
train

By

Published : Jan 5, 2022, 9:32 AM IST

తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్‌లో గతేడాది డిసెంబరు నెలలో టిక్కెట్‌ లేని ప్రయాణికుల నుంచి రూ.2.05 కోట్ల మేర అపరాధ రుసుము వసూలు చేసినట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఐదు ప్రత్యేక బృందాలు, ఇతర సిబ్బంది శ్రమించి టిక్కెట్లు లేని ప్రయాణికులను గుర్తించి 35,342 కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు వెల్లడించారు. ఇది మునుపటి రికార్డులను అధిగమించిందని పేర్కొన్నారు. డివిజన్ వ్యాప్తంగా ఒక నెలలో రెండు కోట్ల అపరాధ రుసుము వసూలు చేయడం పట్ల టికెట్ చెకింగ్ సిబ్బందిని అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details