Waltair Veerayya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో జరుగుతోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీ రిలీజ్ సందర్భంగా అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా..కే.యస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించాడు.
విశాఖలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీగా తరలివచ్చిన మెగా అభిమానులు - సంగీత దర్శకుడు డిఎస్పీ
Waltair Veerayya Pre Release Event: పూనకాలు లోడింగ్ అనే క్యాప్షన్‌తో సినీ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్న మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో మొదలైంది. ఈ సినిమాలో మెగాస్టార్‌తో పాటు మాస్ మహారాజ రవితేజ నటిస్తున్నారు. ఈ వేడుకు వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సినిమా సంక్రాంతి విడుదల కానుంది. దీనికోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
వాల్తేరు వీరయ్య
సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమా ముందస్తు విడుదల కార్యక్రమానికి మధ్యాహ్నమే మెగాస్టార్ చిరంజీవీ, రవితేజ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖకు బయల్దేరారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రం ఈనెల 13న విడుదల కానుంది.
ఇవీ చదవండి: