విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం పెంటపాడు కూరగాయల దుకాణాల సెంటరు వద్ద, జీకేవీధి మండలం ఉబపొలం, ఈతులబైలు వెళ్లే కూడలి వద్ద పోలీసులకు వ్యతిరేకంగా గాలికొండ ఏరియా కమిటీ, సీపీఐ మావోయిస్టు పేరుమీద వాల్ పోస్టర్లు వెలిశాయి. మన్యంలోని ఆదివాసీ గిరిజనులను ఇన్ఫార్మర్లుగా మారుస్తుంది పోలీసులేనని, వారిని ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడేలా తయారుచేస్తున్నారని పోస్టర్లలో పేర్కొన్నారు. వారి చావుకి పోలీసులే కారణమవుతున్నారని మావోయిస్టులు ఆరోపించారు.
గాలికొండ ఏరియా కమిటీ, సీపీఐ మావోయిస్టు పేరుమీద వాల్ పోస్టర్లు - CPI Maoist Latest News
విశాఖ మన్యంలో గాలికొండ ఏరియా కమిటీ, సీపీఐ మావోయిస్టు పేరుమీద వాల్ పోస్టర్లు వెలిశాయి. ప్రజావ్యతిరేక కార్యక్రమాల్లో విద్యావంతులు పాల్గొనవద్దని పోస్టర్లలో కోరారు. ఆదివాసీలను పోలీసులు ఇన్ఫార్మర్లుగా మార్చి... వారికి చావుకు కారణమవుతున్నారని ఆరోపించారు.
![గాలికొండ ఏరియా కమిటీ, సీపీఐ మావోయిస్టు పేరుమీద వాల్ పోస్టర్లు సీపీఐ మావోయిస్టు పేరుమీద వాల్ పోస్టర్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11251474-167-11251474-1617356134251.jpg)
సీపీఐ మావోయిస్టు పేరుమీద వాల్ పోస్టర్లు
పోలీసులకు లొంగి ప్రజావ్యతిరేకంగా మారవద్దని... వీరోచితంగా పోరాటం చేయాలని మావోయిస్టులు పోస్టర్లలో పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పోలీసులు చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు. ప్రజా వ్యతిరేక ర్యాలీలు ధర్నాల్లో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు. పీడిత ప్రజల పక్షాన పోరాడి... జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై గళమెత్తాలని కోరారు.
ఇదీ చదవండీ... ఎన్నికలు ఆపేందుకు కారణాలు కనిపించట్లేదు: ఎస్‌ఈసీ