"జనసేన సొంతంగా పోటీ చేసింది 65 సీట్లలో. పవన్ కల్యాణ్ అనుచరుడు లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెలిచి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నారు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాశారు" అని వైకాపా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగంగా ట్వీట్ చేశారు. దీనికి సీబీఐ మాజీ జేడీ, జనసేన నేత వీవీ లక్ష్మీనారాయణ తన శైలిలో కౌంటర్ ఇచ్చారు. 'మీరు సీఏ చదివారు అయినా.. మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్థం అవ్వడం లేదు. ముందు మీ లెక్కలు సరిచూసుకోండి... ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పని చేసేవాళ్లం. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి'' అని బదులు ట్వీట్ చేశారు.
విజయసాయిరెడ్డి లెక్క సరిచేసిన లక్ష్మీనారాయణ - tweet
ముందు మీ లెక్కలు సరిచూసుకోండి... ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పని చేసేవాళ్లం. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు: వీవీ లక్ష్మీనారాయణ
విజయసాయి రెడ్డి వర్సెస్ లక్ష్మీ నారాయణ
మరో ట్వీట్లో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేసిందో వివరించారు. 140 స్థానాల్లో సొంత బలం మీద జనసేన బరిలోకి దిగింది. మిత్రపక్షాలైన బీఎస్పీ 21, సీపీఐ, సీపీఎంలు 14 స్థానాల్లో పోటీ చేశాయి. ఇలా మొత్తం 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది అవి స్పష్టంగా వివరించారు.
Last Updated : Apr 19, 2019, 11:14 PM IST