ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రేషన్​ దుకాణాల వద్ద రద్దీ నివారణకు చర్యలు తీసుకోవాలి' - vsp joint collector review on 6th term of ration distribution

విశాఖలో నిత్యావసర వస్తువుల ఆరో విడత ఉచిత పంపిణీపై జాయింట్ కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెల్లకార్డు దారులకు ఈనెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రేషన్​ ఇవ్వాలని సూచించారు.

vishaka district
రేషన్ షాపు దగ్గర రద్దీ నివారించటానికి కూపన్ ఇవ్వండి

By

Published : Jun 17, 2020, 12:24 AM IST

విశాఖలో ప్రతి రేషన్ కార్డుపై ఒక కిలో శనగలు, మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని.. అలాగే రూ.10కి అరకిలో పంచదార ఇవ్వాలని జేసీ ఎం.వేణుగోపాల్​రెడ్డి ఆదేశించారు. రేషన్ దుకాణాల వద్ద రద్దీని నివారించడానికి కార్డుదారుడు రావలసిన తేదీ, సమయం వివరాలతో కూపన్ ఇవ్వాలని సూచించారు.

నవశకం సర్వే తర్వాత జిల్లాలో 11,74,568 కుటుంబాలను అర్హులుగా గుర్తించి బియ్యం కార్డులు ఇచ్చినట్లు జేసీ తెలిపారు. ఇంకా 1,96,000 కార్డులు పంపిణీ చేయాల్సి ఉందని.. వీటిని మూడు రోజుల్లోగా పంపిణీ చేయాలన్నారు. కొత్త కార్డులు, కార్డుల్లో కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులపై 6 వేల దరఖాస్తులు వచ్చాయని.. వాటిని పది రోజుల్లో పరిష్కరించాలని అధికారులకు నిర్దేశించారు.

ABOUT THE AUTHOR

...view details