విశాఖ జిల్లా నాతవరం మండలం జిల్లేడుపూడి గ్రామ రెవెన్యూ అధికారి రమణ... ఓ రైతు నుంచి 25 వేలు నగదు లంచం తీసుకుంటూ...ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జిల్లేడుపూడి గ్రామానికి చెందిన సోదరులు బర్రె రమణ, గొవిందు.. తన భూమిని అన్లైన్ చేయడం కోసం వీఆర్వో మునగపాక రమణను ఆశ్రయించారు. అందుకు రూ. 30వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో రమణ సోదరులు అనిశాకు ఫిర్యాదు చేశారు. ఇవాళ రూ. 25 వేల లంచం తీసుకుంటూ చిక్కినట్లు అనిశా అధికారులు తెలిపారు.
రూ.25 వేల లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన వీఆర్వో - అనిశా తాజా వార్తలు
విశాఖ జిల్లా నాతవరం మండలంలో ఓ వీఆర్వో రూ. 25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. తమ భూమిని అన్లైన్ చేయడం కోసం లంచం డిమాండ్ చేయడంతో రైతు అనిశాకు ఫిర్యాదు చేశారు.
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన వీఆర్వో