ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రీస్టార్ట్ చేయకుండానే పోలింగ్ చేశారని ఏజెంట్ల ఫిర్యాదు - ap polling 2019

భీమిలి నియోజకవర్గ పరిధిలోని చిప్పాడలో మాక్ పోలింగ్ ఓట్లను రీస్టార్ట్ చేయకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారని ఏజెంట్లు ఆరోపించారు. ఈ విషయంపై ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు.

రీస్టార్ట్ చేయకుండానే పోలింగ్ చేశారని ఏజెంట్ల ఫిర్యాదు

By

Published : Apr 12, 2019, 12:08 AM IST

రీస్టార్ట్ చేయకుండానే పోలింగ్ చేశారని ఏజెంట్ల ఫిర్యాదు చేశారు.

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధి చిప్పాడ 120 వ అంబర్ పోలింగ్ బూత్​లో తప్పిదం జరిగింది. మాక్ పోలింగ్ యాభై నాలుగు ఓట్లు పోలయ్యాయని... అనంతరం ఈవీఎంను రీస్టార్ట్ చేయకుండా పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారని ఏజెంట్లు తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి 701 ఓట్లు పోలవగా లోక్​సభ విషయంలో మాత్రం 755 ఓట్లు నమోదయ్యాయని... మాక్ పోలింగ్ ఓట్లు కలవటం వల్లనే ఇలా జరిగిందని ఆరోపించారు. ఈ విషయాన్ని అధికారులకు తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details