'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ఓటరు నమోదు అవగాహన సదస్సు కార్యక్రమం Vote Registration Auspices of Eenadu And ETV: ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కును వినియోగించుకోకుంటే అనర్హులు అందలమెక్కి పాలించే ప్రమాదముందని పలువురు వ్యక్తులు అభిప్రాయపడ్డారు. ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఓటరు నమోదు అవగాహన సదస్సులో ఏలూరు జెడ్పీ సీఈవో సుబ్బారావు, తహసీల్దార్ సోమశేఖర్ రావు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ విద్యాసాగర్, కళాశాల ప్రిన్సిపల్, కరస్పాండెంట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓటు హక్కు ప్రాముఖ్యతతో పాటు, ఓటు వేయకుంటే కలిగే నష్టాలను ప్రముఖులు విద్యార్థులకు వివరించారు. ఓటుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి పత్రాలు కావాలి, ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో ఓటు దరఖాస్తు ఎలా అనే అంశాలను విద్యార్థులకు అధికారులు వివరించారు.
ఈవీఎం ద్వారా ఓటు ఎలా వేయాలి, వేసిన ఓటు సరైన వ్యక్తికే పడిందా లేదా అనే అంశాలను ప్రత్యక్షంగా విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వారే స్వయంగా చరవాణిలో ఓటు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చేసి చూపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈనాడు-ఈటీవీ తమ వద్దకే వచ్చి ఓటు దరఖాస్తు చేసుకునే విధానాన్ని తెలియజెప్పడంతో పాటు ఓటు నమోదు చేయించడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండటమే కాకుండా ఓటును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో విశాఖలో ఓటరు నమోదుపై అవగాహనా కార్యక్రమాలు
Vote Registration Conference in Ongole: ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరూ సక్రమంగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావు అన్నారు. ఒంగోలు శ్రీహర్షిణీ కళాశాలలో ఈనాడు - ఈటీవి ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత తమ ఓటర్ల జాబితాలో పేరును నమోదు చేసుకోవాలని, 18 ఏళ్ళు దాటిన ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా ఓటు నమోదు ప్రక్రియలో పాల్గొని ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవాలని కోరారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఓటు అనేది ప్రతీ పౌరుడి ప్రాధమిక హక్కని సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు. పేర్లు నమోదు చేసుకోవడానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంతవరకూ గడువు ఉందని అన్నారు. ఫారం 7ను దుర్వినియోగపరిస్తే చట్టపరంగా శిక్ష పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఒంగోలు ఎమ్మార్వో మురళి, ఈనాడు యూనిట్ ఇన్‌ఛార్జి ఖాన్ , తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులతో ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారు.
''ఈనాడు-ఈటీవీ'' ఆధ్వర్యంలో ఓటరు నమోదు చైతన్య అవగాహనా సదస్సు
Vote Registration Process in Anakapalli:అనకాపల్లి జిల్లా చోడవరంలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు నమోదు, చైతన్యం పై అవగాహన సదస్సు జరిగింది. స్థానిక ఉషోదయ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ సదస్సులో40 మంది విద్యార్థులు ఓటు హక్కు పొందారు. ఆఫ్ లైన్లో విద్యార్థులు ఓటు గురించి దరఖాస్తు చేసుకున్నారు. చోడవరం తహసీల్దార్ ఎల్. తిరుమలరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఉషోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.ఎన్.నాయుడు , దొరబాబు, ఎన్నికల డి.టి నారాయణ రావు లు పాల్గొన్నారు. ఓటు విలువ, ప్రాధాన్యత తెలుపుతూ పవర్ ప్రజెంటేషన్ చేశారు. అక్కడ తొలిసారిగా ఓటు వేసేందుకు ముందుకు అడుగేస్తున్న విద్యార్థులు, ఓటు నమోదుపై అవగాహన పొందారు. ఆన్లైన్లో, ఓటు నమోదు పత్రాల ద్వారా తమ ఓటును నమోదు చేసుకున్నారు. అర్హత కలిగిన ఉత్తమ అభ్యర్థులను ఎన్నుకోవాలనే చైతన్యం పొందారు.
ఓటరు నమోదు అవగాహన కార్యక్రమాల్లో బీఎల్వోలకు వసతుల కొరత - ప్రజలకు తప్పని అవస్థలు
Visakha Degree Coleege: విశాఖ నగరంలోని గాయత్రీ విద్యా పరిషత్ డిగ్రీ - పీజీ కళాశాలలో ఈనాడు- ఈటీవీ సంస్థల ఆధ్వర్యంలో 'ఓటు నమోదు చైతన్యం' సదస్సు నిర్వహించారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటును సద్వినియోగపరుచుకోవాలని గాయత్రీ విద్యా పరిషత్ కళాశాల సంచాలకుడు ఆనంద్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు విశిష్టత, ఆ హక్కును పౌరులందరూ ఏ విధంగా వినియోగించుకోవాలో కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్ యు.సర్వమంగళీశ్వర శాస్త్రి వివరించారు. ప్రతిభ కలిగిన అభ్యర్థికి ఓటు వేస్తే కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆన్లైన్ ద్వారా, నమోదు పత్రాల ద్వారా ఓటు నమోదుపై అవగాహన కలిగించుకున్నారు. కార్యక్రమంలో కళాశాల హిందీ విభాగం అధ్యాపకురాలు డాక్టర్ అనిత తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఓటరు నమోదు ప్రక్రియ
Tirupati SSV College: దేశభవిష్యత్తులో యువత పాత్ర చాలా కీలకమైందని తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈనాడు-ఈటివీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్ఎస్వీ కళాశాలలో నిర్వహించిన ఓటు నమోదు, చైతన్యం అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. యువతకు ఓటు హక్కు గురించి అవగాహన కల్పించడంలో ఈనాడు, ఈటివీ కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు ఎలాంటి ప్రలోభాలకు లోంగకూడదని ఆయన తెలిపారు. యువత ఓటు నమోదు చేసుకోవడంపై ఆసక్తి చూపడం లేదని, ఓటు హక్కు ఉన్నా వినియోగించుకోవడం లేదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఓటు హక్కు పొందిన తర్వాత పండగ వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా రాబోయే 5 సంవత్సరాలు యువత భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. అవగాహన సదస్సు అనంతరం యువతకు ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఓటు హక్కు నమోదు, ప్రాముఖ్యత తెలపడం పట్ల విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు.
'నేటికీ 33శాతం మంది ఓట్లు వేయడం లేదు - పోలింగ్ శాతం తగ్గితే ఓటు బ్యాంకు రాజకీయాలు'