విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో వాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, కే. కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో మొత్తం 23 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు ఆన్ లైన్లో ఈనెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. 18 ఏళ్లు నిండి ఉండి 35 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులని తెలిపారు.
మండలాల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి
- మాడుగుల మండలంలో తాటిపర్తి, కేజే.పురం, అవురువాడ, వీరనారాయణం, చింతలూరు గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- కే. కోటపాడు మండలంలో ఆర్లి, కే. సంతపాలెం, ఆర్.వై.అగ్రహారం, పోతనవలస, సూదివలస, పాతవలస, చౌడువాడ, కింతడ గ్రామాల్లో మొత్తం 8 వాలంటరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- దేవరాపల్లి మండలంలో రైవాడ - 2, దేవరాపల్లి - 2, మామిడిపల్లి, ములకలపల్లి, నాగయ్యపేట గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 7 వాలంటరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- చీడికాడ మండలంలో కోనాం, పెదగోగాడ, జేబీ. పురం గ్రామాల్లో ఒకటి చొప్పున మొత్తం 3 వాలంటరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.