లాక్డౌన్ కారణంగా జలంధర్ నుంచి వచ్చి విశాఖలో చిక్కుకున్న వలసకూలీలను ఆదుకునేందుకు దాతలు ముందుకొచ్చారు. పవర్ స్వచ్ఛంద సంస్థ, విశాఖ కెమిస్ట్స్ సొసైటీ వారు సంయుక్తంగా కార్మికులను జలంధర్ వెళ్లేందుకు రైలు ప్రయాణ ఏర్పాట్లు చేశారు. పవర్ సంస్థ కార్యదర్శి అబ్దుల్ రఖీబ్, విశాఖ కెమిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు బగ్గాం శ్రీనివాసరావు వలస కార్మికులకు రైలు రిజర్వేషన్ టికెట్లు, ప్రయాణికులకు అవసరమైన తినుబండారాలు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. స్వస్థలాలకు చేరుకున్న తర్వాత ఇబ్బందులు పడకుండా పదిరోజుల రేషన్ కాయగూరలు ఇచ్చారు. లాక్డౌన్ సమయంలో నివాస గృహాలు లేక. ప్రయాణానికి సరిపడా డబ్బులు లేక చాలా మంది దిక్కుతోచని స్థితిలో కంచరపాలెం రామ్మూర్తి పంతులు పేట బ్రిడ్జి కింద తలదాచుకుంటూ ఇబ్బందులు పడ్డారు.
వలసకూలీలకు స్వచ్ఛంద సంస్థల సహాయం
విశాఖలో లాక్డౌన్ వల్ల చిక్కుకున్న వలసకూలీలను పవర్ స్వచ్ఛంద సంస్థ, విశాఖ కెమిస్ట్స్ సొసైటీ వారు వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రయాణానికి సరిపడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి... రైల్వే టికెట్లు, ప్రయాణికులకు కావాల్సిన అవసరాలను ఇచ్చి ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు.
జలంధర్ వలసకూలీలకు సరుకులు అందించి ఇళ్లకు పంపిస్తున్న స్వచ్ఛంద సంస్థలు