విశాఖ జిల్లా అరకు లోయలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. కొవిడ్ కట్టడి చర్యలో భాగంగా పది రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌కు అరకు ఎమ్మెల్యే, అఖిలపక్ష నాయకులు వర్తక సంఘం ప్రతినిధులు నిర్ణయించారు. ఈ మేరకు సంపూర్ణ స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతోంది. వర్తక, వాణిజ్య దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. హోటళ్లు, అతిథి గృహాలు మూతపడ్డాయి. అరకులోయ నిర్మానుష్యంగా మారింది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో స్థానికుల వినతి మేరకు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు.
అరకులో స్వచ్ఛంద లాక్ డౌన్ - Voluntary lock down in Araku
అరకులోయలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. కొవిడ్ కట్టడి చర్యలో భాగంగా పది రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్‌కు అరకు ఎమ్మెల్యే, అఖిలపక్ష నాయకులు వర్తక సంఘం ప్రతినిధులు నిర్ణయించారు. ఈ మేరకు సంపూర్ణ స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతోంది.
అరకులో స్వచ్ఛంద లాక్ డౌన్