ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్ర - ఒడిశా సరిహద్దు యువతకు వాలీబాల్ పోటీలు - ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దుల్లో వాలీబాల్ పోటీలు

యువతలో చైతన్యం నింపేందుకు ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు వాలీబాల్ పోటీలను నిర్వహించారు. 12 పంచాయతీలకు చెందిన 75 జట్లు తలపడ్డాయి.

volleyball
volleyball

By

Published : Oct 28, 2020, 10:01 PM IST

విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన.. ఆంధ్ర - ఒడిశా సరిహద్దు యువతలో చైతన్యం నింపేందుకు పాడేరు డీఎస్పీ రాజ్​కమల్ వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. ముంచంగిపుట్టు మండలం కాండ్రగి వలస గ్రామంలో విశాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 12 పంచాయతీలకు చెందిన యువకులకు ఈ పోటీలు నిర్వహించారు.

సమీప గ్రామాలకు చెందిన 75 జట్లు పోటీపడ్డాయి. రెండు రోజుల పాటు ఈ పోటీలను నిర్వహించనున్నారు. యువత సమాజ శ్రేయస్సువైపు అడుగులు వేయాలని.. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. పాడేరు సీఐ పీపీ.నాయుడు, ముంచంగిపుట్టు, పెదబయలు ఎస్సైలు ప్రసాదరావు, రాజారావు పాల్గున్నారు.

ABOUT THE AUTHOR

...view details