ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2 జిల్లాలు.. 35 మండలాలు.. 4873.38 చ.కి.మీ.. వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌

విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ - 2041 బృహత్తర ప్రణాళిక 2051 - దృక్కోణ ప్రణాళికను... ప్రభుత్వం ఆమోదించింది. కొత్త ప్రణాళిక అమలుకు గెజిట్ ప్రకటించింది. ఈ నెల 8 నుంచి కొత్త ప్రణాళిక అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆర్నెళ్ల పాటు.. నగర, పురపాలక కార్యాలయాలు, కార్పొరేషన్లు, పంచాయతీ కార్యాలయాల్లో.. కొత్త ప్రణాళిక చిత్రాలు ప్రదర్శించనున్నారు.

vmrda
vmrda

By

Published : Nov 13, 2021, 4:37 PM IST

విజయనగరం, విశాఖ జిల్లాల్లోని 35 మండలాల్లో.. 4873.38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాస్టర్‌ప్లాన్‌కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీఎమ్​ఆర్​డీఏ కొత్త బృహత్తర ప్రణాళిక సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. గత నెల 25న బోర్డు సమావేశంలోనే ఆమోదించి ప్రభుత్వానికి సమర్పించగా.. కేవలం రెండు వారాల వ్యవధిలో పచ్చజెండా ఊపింది. ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు సూచిస్తుందని భావించినప్పటికీ.. ఆలోపే అమలుకు ఉత్తర్వులిచ్చారు. ఇందులో... జోనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్ ప్రమోషన్ల వివరాలు, నివాస, మిశ్రమ, పారిశ్రామిక, ప్రభుత్వ వినియోగ, ఉల్లాస ప్రాంతం, రవాణా, వ్యవసాయ, నిషేధిత ప్రాంతాల్లో.. ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి, చేపట్టకూడదనే వివరాలు పొందుపరిచారు.

  • వీఎంఆర్‌డీఏ పరిధి : 7328.86 చ.కి.మీ
  • మాస్టర్‌ప్లాన్ విస్తీర్ణం : 4873.38 చ.కి.మీ
  • జిల్లాలు : విశాఖ, విజయనగరం
  • మండలాలు : 35
  • మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరాలు: 17,460

వీఎంఆర్‌డీఏలో ప్రణాళిక అమలు ఇలా..

  • ప్రణాళిక సమయం విస్తీర్ణం (చ.కి.మీ.)
  • మూడో ప్రణాళిక 2021-41 4,873.38
  • రెండో ప్రణాళిక 2006-21 1,721
  • మొదటి ప్రణాళిక 1989-2001 1,721

భీమిలి, భోగాపురం, విజయనగరం, పెందుర్తి మండలాల్లో వీఎమ్​ఆర్​డీఏ అనుమతించిన లేఅవుట్ల మీదుగా రోడ్లు ప్రతిపాదించడం విమర్శలకు దారితీసింది. జలవనరులు, ప్రైవేటు స్థలాల మీదుగా జిరాయితీ భూముల్ని ప్రభుత్వ భూములుగా చూపడంపైనా వ్యతిరేకత వచ్చింది. 2051 దృక్కోణ ప్రణాళిక అమల్లో భాగంగా.. భీమిలి, భోగాపురం ప్రాంతాల్లో అనుసరించిన వ్యూహాత్మక గ్రిడ్‌ విధానంపైనా.. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అహ్మదాబాద్‌కు చెందిన కన్సల్‌టెంట్లు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ప్రణాళిక రూపొందించారన్న ఆరోపణలు వచ్చాయి.

ఇప్పటికే వీఎమ్​ఆర్​డీఏ బృహత్తర ప్రణాళికపై.. ప్రజల నుంచి 17 వేలకుపైగా అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో భీమిలి, భోగాపురం, విజయనగరం, పెందుర్తి, ఆనందపురం మండలాల నుంచే ఎక్కువ వినతులు వచ్చాయి. రోడ్లు, భూవినియోగం మార్చాలంటూ వచ్చినవే అధికంగా ఉన్నాయి. వీటిల్లో ఎన్నింటిని పరిగణనలోకి తీసుకున్నారనేది చిత్రపటాలు అందుబాటులోకి వస్తే తప్ప తెలిసే అవకాశం లేదు.

వీఎమ్ఆర్డీఏ బృహత్తర ప్రణాళిక

ఇదీ చదవండి:
అసోం రైఫిల్స్ కాన్వాయ్​పై ఉగ్రదాడి- భారీగా ప్రాణనష్టం!

ABOUT THE AUTHOR

...view details