విశాఖ స్టైరీన్ విషాదం ప్రపంచంలోనే రెండోది. ఈ విష వాయు ఆవిరి లీకేజీ తొలిసారి 2014లో అమెరికాలో నమోదయ్యిందని జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (నీరి) నిపుణులు వెల్లడించారు. స్టైరీన్ని గూడ్స్ రైటు ట్యాంకర్లలో తరలిస్తున్నప్పుడు లీకైనట్లు వివరించారు. సరిగ్గా ఆ ప్రదేశంలో జనావాసాలు లేకపోవటంతో ప్రాణ నష్టం జరగలేదు. అప్పట్లోనూ ఘటనకు 0.5 కిలోమీటరు నుంచి ఒక కిలోమీటరు దూరంలో ఉన్నవారిని ఇతర ప్రాంతాలకు హుటాహుటిన తరలించారు. నాటి ఘటనలో పర్యావరణపరమైన ఇబ్బందులు ఏర్పాడ్డాయని నీరి నిపుణులు తెలిపారు.
విశాఖ విషాదం... ప్రపంచంలోనే రెండోది
విశాఖ జిల్లా ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామస్థుల జీవితాల్లో పెను విషాదం నింపిన స్టైరీన్ గ్యాస్ లీకేజీపై నీరి నిపుణులు లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ విష వాయువు లీకేజీ ప్రపంచంలోనే రెండో విషాదంగా గుర్తించారు.
ప్రపంచంలోనే రెండోదిగా విశాఖ