ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమెరికాలో విశాఖవాసి మృతి - student died

అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. విశాఖ సీతమ్మధారకు చెందిన సుమేద్ స్నేహితులతతో కలిసి క్రెటర్ సరస్సులో సరదాగా గడిపేందుకు వెళ్లి మునిగిపోయినట్లు సమాచారం.

vizag-student-drowned-in-usa

By

Published : Aug 21, 2019, 5:48 AM IST

అమెరికాలో తెలుగు విద్యార్థి సుమేద్ స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు క్రెటర్ సరస్సుకు వెళ్లి దుర్మరణం పాలయ్యాడు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తనతోపాటు ఇద్దరు స్నేహితులతో క్రెటర్ సరస్సుకు వెళ్లినట్లు తెలుస్తుంది. సరస్సులోకి వెళ్లిన కాసేపటికే ఈతరాక మునిగిపోయినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తరువాత విశాఖలో ఉంటున్న సుమేద్ తల్లిదండ్రులకు అక్కడి పోలీసులు సమాచారం అందించారు. కాగా మృతుడు తండ్రి ఎం.ఎస్.కుమార్ స్టీల్ ప్లాంట్ క్రీడల శాఖ డీజీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details