విశాఖ జిల్లా యలమంచిలిలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కౌంటింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు తెరిచి చూడగా అందులో 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' నినాదాలు రాసిన పత్రాలు కనిపించాయి. దీంతో బ్యాలెట్ పత్రాల నుంచి ఆ పేపర్లను సిబ్బంది వేరు చేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు సాగుతున్నాయి.
యలమంచిలిలో మున్సిపల్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి చూస్తే...
విశాఖ జిల్లా యలమంచిలి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ చేపట్టేందుకు.. బ్యాలెట్ బాక్సులు తెరిచిన సిబ్బందికి, బ్యాలెట్ పత్రాలతో పాటు మరో పత్రాలు కూడా కనిపించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' అని రాసి ఉన్న పేపర్లు ఉన్నట్లు సిబ్బంది వెల్లడించారు.
విశాఖ ఉక్కు నినాదాలు