విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడ్డ ఉక్కు కర్మాగారాన్ని.. ప్రైవేటీకరణ చేయడమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాళా తీయించటమే అన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని నేతలు స్పష్టం చేశారు.
'ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడమంటే రాష్ట్రాన్ని దివాళా తీయించడమే' - వైజాగ్ స్టీల్ ప్లాంట్ న్యూస్
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా.. చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని నేతలు స్పష్టం చేశారు.
11వ రోజుకు చెరుకున్న రిలే నిరాహార దీక్షలు