మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా.. విశాఖ ఉక్కు నిరసనకారులు ఆందోళన విరమించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ.. కూర్మన్నపాలెం కూడలిలో 36 గంటలుగా జాతీయ రహదారిని నిర్బంధించారు.
నేడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కారణంగా... ఇవాళ ఒక్కరోజు వరకు నిరసనలు నిలిపివేస్తున్నట్లు వారు వెల్లడించారు. మరోవైపు.. కూర్మన్నపాలెం కూడలిలో 27వ రోజు సైతం రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.