ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వందో రోజుకు చేరిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల దీక్షలు - vizag steel plant privatization news

వాళ్లంతా ఆ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగులు. ఎప్పట్లాగే విధులు నిర్వహిస్తుండగా గుండెల్లో గుబులు పుట్టించే వార్త. ఆ సంస్థని ప్రైవేటీకరణ చేస్తామన్న కేంద్రం ప్రకటనతో కార్మికులు, ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు వందో రోజుకు చేరుకున్నాయి.

వందో రోజుకు చేరిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల దీక్షలు
వందో రోజుకు చేరిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల దీక్షలు

By

Published : May 22, 2021, 6:37 AM IST

Updated : May 22, 2021, 7:20 AM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు వందో రోజుకు చేరుకున్నాయి. వంద రోజుల పోరాటం సందర్భంగా స్టీల్‌ ప్లాంట్‌ ప్రధాన ద్వారం దగ్గర వివిధ నిరసన కార్యక్రమాలు చేయడానికి ఉక్కు పరిరక్షణ, కార్మిక సంఘ నేతలు నిర్ణయించారు.

రాష్ట్ర ఎంపీలందరూ కలిసి స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పరిరక్షణ సమితి నేతలు కోరుతున్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పోరాటం ఆపబోమని నిర్వాసిత గ్రామాల ప్రజలు కూడా చెప్తున్నారు. మిగులు భూమిని పంపిణీ చేసి నిర్వాసితుల సమస్యలు తీర్చాలని డిమాండ్‌ చేశారు. ఉక్కు పరిశ్రమని ప్రభుత్వ రంగ సంస్థగా కొనస్తామన్న నిర్ణయం తీసుకునే వరకూ ఉద్యమాన్ని ఆపబోమని కార్మిక, నిర్వాసిత సంఘ నేతలు చెప్తున్నారు.

వందో రోజుకు చేరిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల దీక్షలు

ఇదీచదవండి.

విశాఖ: గుండెపోటుతో మత్తు వైద్యుడు సుధాకర్ మృతి

Last Updated : May 22, 2021, 7:20 AM IST

ABOUT THE AUTHOR

...view details