పీ.కే. రథ్ మీడియా సమావేశం ఈ ఆర్థిక సంవత్సరం విశాఖ ఉక్కు కర్మాగారం అన్ని రంగాల్లో మంచి పురోగతి సాధిస్తోందని విశాఖ ఉక్కు సీఎండీ పీ.కే. రథ్ తెలిపారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఉత్పత్తిలో 10 నుంచి 12 శాతం.. అమ్మకాల్లో 25 శాతం వృద్ధి సాధించామన్నారు. ఈ ఏడాది 20వేల 500 కోట్ల టర్నోవర్‌ను సాధించనుందని తెలిపారు. ఉక్కు కర్మాగార చరిత్రలో ఇంత టర్నోవర్ సాధించడం ఇదే ప్రథమమన్నారు. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి స్థాయికి స్టీల్‌ప్లాంట్ చేరుకుందన్నారు. తాము తయారుచేసిన స్టీల్ పోలవరం నిర్మాణాలలో, యూనిటీ ఆఫ్ లిబర్టీ, రోహటాంగ్ టన్నెల్ నిర్మాణంలో, పలు మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ నిర్మాణాలలో వినియోగించారని చెప్పారు. కొలంబోలో విశాఖ ఉక్కు యార్డు నెలకొల్పి అమ్మకాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో వ్యాపార విస్తృతికి నదీ రవాణాను వినియోగించినున్నట్లు వివరించారు.
ఇవీ చదవండి.