ఈ కేసు దర్యాప్తు సంబంధించి నిందితుడు నరేంద్ర కుమార్ ప్రతి ఆదివారం ఆరిలోవ స్టేషన్లో సంతకం చేయాలని, కేసు దర్యాప్తులో సహకరించాలని కోర్టు తెలిపింది.
ఏప్రిల్ 13న రుషికొండ బీచ్లో కొంతమంది వ్యక్తులు రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో నిషేధిత మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. కేసును విచారణ జరుపుతున్న ఆరిలోవ పోలీసులు నిందితుడు నరేంద్ర వాగ్మూలం నమోదు చేసి, విడుదల చేశారు.