విశాఖపట్నంలో భిక్షాటన చేసుకొని జీవిస్తున్న దంపతుల బాబును దుండగలు కిడ్నాప్ చేసి.. విజయనగరం తీసుకువెళ్లిపోయారు. దీంతో బాధిత తల్లిదండ్రులు రెండో పట్టణ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా.. 24 గంటల్లోనే బాబును కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు పోలీసులు.
అసలు ఏం జరిగిందంటే..
భిక్షాటన చేసుకుంటున్న దంపతుల వద్ద నుంచి బాబును దుండగలు ఎత్తుకెళ్లారు. బాబు పక్కన లేకపోవటం గమనించిన తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెతికినా... ఫలితం లేకపోవటంతో, రెండో పట్టణ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆటోలో వచ్చి, బాబును ఎత్తుకెళ్లిన దృశ్యాల ఆధారంగా... నిందితులు విజయనగరం వెళ్లినట్లు నిర్ధరించుకున్నారు. విజయనగరంలో పోలీసులు గాలించగా.. నిందితులు పట్టుబడ్డారు. సల్మాన్ ఖాన్, షేక్ సుభానీ, బండారు రోషన్‌ను నిందితులుగా గుర్తించినట్లు పోలీసులు వివరించారు.
బండారు రోషన్ అత్తయ్య గౌరి పిల్లల్ని పెంచుకుంటానని చెప్పటంతో... బాలుడిని కిడ్నాప్ చేసి తీసకువెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులతోపాటు, పిల్లల్ని తీసుకురమన్న గౌరినీ అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. 24 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన రెండో పట్టణ పోలీసులను ఆర్కే మీనా అభినందించారు.
24 గంటల్లోనే కిడ్నాపర్లను పట్టుకున్న విశాఖ పోలీసులు - కిడ్నాపర్లు పట్టుకున్న పోలీసులు
విశాఖ రెండో పట్టణ పోలీసులు 24 గంటల్లోనే కిడ్నాప్ అయిన బాబుని తల్లిదండ్రుల చెందకు చేర్చారు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందం అవధుల్లేకుండా పోయింది. అసలు కిడ్నాప్ ఎలా చేశారంటే..
24 గంటల్లోనే కిడ్నాపర్లను పట్టుకున్న విశాఖ పోలీసులు
ఇదీ చదవండి:చోడవరంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు