విశాఖ నగరం 42వ వార్డు రైల్వే న్యూ కాలనీలో మూసివేసిన రహదారి ప్రాంతాన్ని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పరిశీలించారు. కాలనీలోని పరదేశమ్మ గుడి వద్ద రైల్వే అధికారులు ప్రహరీ నిర్మించడంతో రాకపోకలు స్తంభించాయి. ఫలితంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న ఎంపీ సత్యనారాయణ, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్, రైల్వే డీఆర్ఎం ను సంప్రదించి సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ సత్యనారాయణ హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా పనులు చేయబోమని స్పష్టం చేశారు.
విశాఖ రైల్వే కాలనీలో ఎంపీ పర్యటన - విశాఖ నేటి వార్తలు
విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పర్యటించారు. నగరంలోని రైల్వే న్యూకాలనీలో నిర్మించిన ప్రహరీని పరిశీలించారు. వాహనాల రాకపోకలకు అడ్డుగా ఉన్న ఆ గోడను తొలగిస్తామని హామీ ఇచ్చారు.
విశాఖ రైల్వే కాలనీలో ఎంపీ పర్యటన