ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''నా కుమారుడిని గెలిపించండి.. మంచి చేస్తాడు'' - తెదేపా

విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తల్లి శ్రీమణి.. విశాఖలో పలు చోట్ల ఎన్నికల ప్రచారం చేశారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ తో కలిసి ప్రజలను కలిశారు. తన కుమారుడిని గెలిపించాల్సిందిగా కోరారు.

విశాఖ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీభరత్ తల్లి శ్రీమణి

By

Published : Apr 4, 2019, 5:55 PM IST

విశాఖ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీభరత్ తల్లి శ్రీమణి
విశాఖపట్నం తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ తరఫున ఆయన తల్లి శ్రీమణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ తో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. నగరంలోని 31వ వార్డులో రైల్వే న్యూకాలనీ, దొండపర్తి, టీ.ఎస్.ఎన్ కాలనీల్లో తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. యువతకు, సామాన్య ప్రజానీకానికి ఏం కావాలో తెలుసుకుని పనిచేయగల సమర్థత తన కుమారుడికి ఉందని శ్రీమణి భరోసా ఇచ్చారు.శ్రీభరత్ గెలిస్తే యువతకు మేలు చేస్తారన్నారు.

ABOUT THE AUTHOR

...view details