ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MAYOR: ఆర్టీసీ బస్సులో విశాఖ మేయర్ ప్రయాణం​.. అందుకేనా..! - విశాఖ జిల్లా తాజా వార్తలు

MAYOR: విశాఖ మేయర్​ గొలగాని హరి వెంకట కుమారి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. నగర వాసులకు ప్రజారవాణా, కాలుష్య నివారణపై అవగాహన కల్పించేందుకు బస్సులో ప్రయాణించారు. కాలుష్య నివారణలో తన వంతు భాగస్వామ్యంగా ప్రతి సోమవారం ప్రజారవాణాలో ప్రయాణం చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

MAYOR
MAYOR

By

Published : Jul 19, 2022, 5:31 PM IST

MAYOR: విశాఖ నగరంలో పేరుకుపోతున్న కాలుష్యాన్ని నివారించడంతో పాటు.. ప్రజా రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఆరిలోవ బస్​స్టాప్ నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకు ఆర్టీసీ బస్సులో టిక్కెట్ తీసుకుని ప్రయాణం చేశారు. ఆమెతోపాటు సిబ్బంది కూడా బస్సులో వచ్చారు. కాలుష్య నివారణలో తన వంతు భాగస్వామ్యంగా ప్రతి సోమవారం బస్సులో ప్రయాణం చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. నగరవాసులు కూడా కాలుష్య నివారణకు తమ వంతు సహకారం అందించి.. ప్రజారవాణాను ఉపయోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details