భారతీయ మహిళల ఖ్యాతి ప్రపంచ దేశాలకు విస్తరించిందని.. జాతీయ బాక్సింగ్ కోచ్ కర్రి మాధవి అన్నారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌లో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాధవిని.. ప్రెస్‌క్లబ్ కార్యవర్గం ఘనంగా సన్మానించింది. అలాగే ప్రతిభావంతులైన మరికొంత మంది మహిళా పాత్రికేయులను సన్మానించారు. ఈ వేడుకలో స్కూల్ అఫ్ థియేటర్ ఆర్ట్స్ బాలికలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం - వైజాగ్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
ప్రపంచ దేశాలలో భారతీయ మహిళలకు గుర్తింపు లభిస్తోందని జాతీయ బాక్సింగ్ కోచ్ కర్రి మాధవి అన్నారు. స్త్రీ, పురుషులు పరస్పరం అవగాహనతో జీవితం సాగిస్తే ఎన్నో విజయాలను సాధించవచ్చని చెప్పారు.

వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం