విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను తిరిగి ప్రారంభించారు. కరోనా కారణంగా గత మార్చి నుంచి జూను మూసివేశారు. ఈ నెల 17 నుంచి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జూను తెరిచారు. మొదటిరోజే సందర్శకులు భారీగా తరలివచ్చారు. కరోనా నేపథ్యంలో జూ అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు.
జూ అధికారిక వెబ్సైట్ నుంచి టికెట్లు కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. అలానే జూ వద్ద టికెట్స్ కొనేలా ఏర్పాటు చేశారు. థర్మల్ స్ర్కీనింగ్, శానిటైజర్ లాంటివి ఏర్పాటు చేశారు. రోజుకు 4,400 మందినే లోపలికి అనుమతిస్తున్నారు. సందర్శకులు ఒక వరుస క్రమంలో జంతువులను తిలకించేలా తెలుపు, పసుపు రంగు సర్కిళ్లను గీశారు. సందర్శకులను గ్రూపులుగా విడదీసి లోపలకు పంపేలా చర్యలు తీసుకున్నారు.
ఒక వ్యక్తి 2 గంటలు మాత్రమే జూ లోపల ఉండేలా సమయం నిర్దేశించారు. జంతువులకు రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుప తీగలను తాకకూడదనే నియమం పెట్టారు. జంతుప్రదర్శన శాలలో ఉమ్మి వేయడం, జంతువులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే రూ. 2 వేల రూపాయలు జరిమానా కట్టేలా కఠిన నిబంధనలు పెట్టారు.