విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ లీకేజ్ ప్రభావం.. మూగ జీవాలపై తీవ్రంగా కనిపిస్తోంది. పెట్టిన గడ్డి తినక, నీరు ముట్టకుండా... నిలబడే ఓపిక లేక.. చాలా పశువులు కూలబడిపోతున్నాయి. ఘటన రోజు స్టైరిన్ వాయువు పీల్చి అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన ఆవులు కొన్నైతే, కొన ఊపిరితో కొట్టుమిట్టాడి చనిపోయినవి కొన్ని.
ఆ ఘటనలో విష వాయువు ఆవిరి ప్రభావానికి శరీరం కాలి.. ప్రాణాలతో బయటపడిన గేదెలు ఇప్పుడు పశుగ్రాసం ముట్టడం లేదు. మంచి నీరు సైతం తాగటం లేదని వాపోతున్నారు వాటి యజమానులు. వాటి బాధ చెప్పుకునేందుకు మాట రాదు కదా అని కన్నీటి పర్యంతం అవుతున్నారు వారు.
వరుస ఘటనలు జీర్ణించుకోలేకపోతున్న గోసంరక్షకులు