ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ టీకా పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించండి' - కరోనా టీకా పంపిణీపై విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ సూచనలు

జిల్లాలో కరోనా టీకా పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులకు సూచించారు. మొదటి దశలో టీకాను ఆరోగ్య, అంగన్​వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎంఎన్​లకు ఇస్తామని తెలిపారు.

collector vinay chand meeting
కలెక్టర్ వినయ్ చంద్ సమావేశం

By

Published : Dec 3, 2020, 5:03 PM IST

విశాఖ జిల్లాలో కొవిడ్‌ టీకాను పంపిణీ చేసేందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు. దీనిపై టాస్క్​ఫోర్స్ ఇమ్యునైజేషన్ సమావేశం నిర్వహించారు. తొలిదశలో టీకాను ఆరోగ్య కార్యకర్తలు, అంగన్​వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎంఎన్​లకు ఇస్తామని కలెక్టర్ చెప్పారు. రెండో దశలో 50ఏళ్లు పైబడిన వృద్ధులకు, మధుమేహం, బీపీ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తామన్నారు. ఫ్రంట్​లైన్ వర్కర్ల జాబితా తయారుచేయాలని, వ్యాక్సినేషన్ నిల్వపాయింట్లు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈనెల 7వ తేదీన ఆయా అంశాలపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details