ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుకాణాలు తెరవనివ్వడం లేదంటూ వ్యాపారుల ఆవేదన - చోడవరంలో ఎమ్మెల్యే ధర్మశ్రీని కలిసిన వ్యాపారులు

ప్రధాన రహదారిలో ఉన్న తమ దుకాణాలు తెరవడానికి పోలీసులు అనుమతివ్వడం లేదని.. విశాఖ జిల్లా చోడవరం వ్యాపారులు ఎమ్మెల్యే ధర్మశ్రీని కలిశారు. తమ షాపులకు అనుమతివ్వాలని కోరారు.

vizag district chodavaram merchants meets mla dharmasri for request to open shops
దుకాణాలు తెరవనివ్వడం లేదంటూ వ్యాపారుల ఆరోపణ

By

Published : May 6, 2020, 3:13 PM IST

లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినా తమ దుకాణాలు తెరవడానికి పోలీసులు అనుమతివ్వడం లేదంటూ.. విశాఖ జిల్లా చోడవరంలోని వ్యాపారస్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిలో ఉన్న తమ షాపులు తెరిచేందుకు అనుమతిచ్చేలా చూడాలని ఎమ్మెల్యే ధర్మశ్రీని కోరారు.

దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ప్రధాన రహదారిలో దుకాణాలు తెరిచేందుకు అనుమతి లేదని... పట్టణంలో మిగతా చోట్ల తెరుచుకోవచ్చని చెప్పారు. వారి డిమాండ్లపై కలెక్టరుతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details