కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సూచించారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. గత వారం నుంచి కొవిడ్ విస్తరణ పెరిగినట్లు స్పష్టం చేశారు. 49 కంటైన్మెంట్ జోన్లలలో అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
'విశాఖ ప్రజలూ... పోలీసులకు సహకరించండి' - etv bharat interview with vizag cp news
విశాఖలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో మరింత అప్రమత్తమైన అధికారులు కొవిడ్ కట్టడికి అన్ని జాగ్రత్తల చర్యలు చేపడుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండి... పోలీసు వారికి సహకరించాలని విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా విజ్ఞప్తి చేశారు.
విశాఖ సీపీ ఆర్కే మీనాతో ఈటీవీ భారత్ ముఖాముఖి
'ప్రజలెవ్వరూ అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. రహదారి పైకి వచ్చినప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలి. ఎటువంటి సభలకు, కార్యక్రమాల్లో పాల్గొనవద్దు. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.' - విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా
ఇదీ చదవండి: దివ్య హత్య కేసు: తల్లిదండ్రుల మరణం తీరుపై పోలీసుల ఆరా