ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉన్నత స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తాం' - minister avanthi srinivas

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్​, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విశాఖ నగరపాలక సంస్థ మేయర్ హరికుమారి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశాఖ కార్పొరేషన్​ను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు తమ వంతు సహాయం చేస్తామని మంత్రి, ఎంపీ వెల్లడించారు.

vizag corporation mayor hrikumari couple meet minister avanthi, mp  mvv sathyanarayana in
విశాఖ నగరపాలక సంస్థ మేయర్ హరికుమారి

By

Published : Mar 26, 2021, 5:22 PM IST

రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్​ను, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను జీవీఎంసీ మేయర్ వెంకట హరికుమారి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన నగర మేయర్ హరికుమారికి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. మహా విశాఖ నగరపాలక సంస్థను దేశంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఎంపీ స్పష్టం చేశారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పౌర సేవలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. మేయర్ దంపతులతో పాటు డిప్యూటీ మేయర్ జి శ్రీధర్ ఎంపీని కలిశారు.

ABOUT THE AUTHOR

...view details