గుజరాత్ నుంచి ప్రత్యేక బస్సుల్లో 418 మంది విశాఖ జిల్లాకు చేరుకున్నారు. ఈ మత్స్యకారుల్ని కలెక్టర్ వినయ్ చంద్ కలిశారు. పట్టణంలోని 4 కల్యాణ మండపాల్లో వీరిని ఉంచారు. కలెక్టర్ వినయ్ చంద్ మత్స్యకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారి నుంచి నమూనాలు సేకరించి కొవిడ్ నిర్ధరణ పరీక్షలకు పంపించారు. పరీక్షా ఫలితాలు వచ్చేవరకు వారిని క్వారంటైన్లో ఉంచనున్నారు. కరోనా ఫలితాలను బట్టి వారిని హోం క్వారంటైన్ లేదా ఐసోలేషన్‌కు తరలించనున్నారు.
గుజరాత్ నుంచి విశాఖ చేరుకున్న మత్స్యకారుల్ని కలిసిన కలెక్టర్
గుజరాత్ నుంచి విశాఖ చేరుకున్న మత్స్యకారులను క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. వారి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. ఫలితాలను బట్టి వారిని హోం క్వారంటైన్ లేదా ఐసోలేషన్‌కు తరలించనున్నారు.
గుజరాత్ నుంచి విశాఖ చేరుకున్న మత్స్యకారుల్ని సందర్శించిన కలెక్టర్