కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదుపాయాన్ని వినియోగించుకోవాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ముందుగా అన్లైన్లో లేదా కలెక్టరేట్లో పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు.
'సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోండి' - vizag news today
జిల్లాలో ఉన్న వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదుపాయాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ప్రతి ఒక్కరిని స్వగ్రామాలకు పంపుతామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజల వివరాలను పంపించి, వారి నుంచి అనుమతి వచ్చిన తర్వాత స్వస్థలాలకు పంపుతామని అన్నారు. లాక్‌డౌన్‌తో ఇక్కడ చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోవడానికి 89127373402, 89127373503 నంబర్లను గాని, www.spandana1.ap.gov.in. సంప్రదించాలని చెప్పారు. దరఖాస్తుదారులను దశల వారీగా పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందుకోసం వలస కార్మికులు ఏ కార్యాలయాన్నీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదీచదవండి