కరోనా కాలానికి సంబంధించి... ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని సీఐటీయూ విశాఖ నగర అధ్యక్షుడు ఆర్.కే.ఎస్.వీ. రవికుమార్ డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా.. పొరుగు సేవల సిబ్బంది, హైర్ బస్సుల సిబ్బంది వేతనాలు లేక తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి వేతనాలు చెల్లించటంతో పాటు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కాంట్రాక్టు విధానం రద్దు చేసి, ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్లో ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ కు సామూహిక రాయబారం కార్యక్రమం ద్వారా కార్మికుల సమస్యలను తెలియజేస్తామని తెలిపారు.
'ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందికి వేతనాలు చెల్లించాలి' - vizag news updates
కరోనా కాలంలో ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని సీఐటీయూ నగర ఆధ్యక్షుడు రవికుమార్ డిమాండ్ చేశారు. విశాఖలో రవికుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
విశాఖలో సీఐటీయూ సమావేశం