ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంజంగి కొండల్లో పర్యటకుల సందడి - విశాఖ మన్యం వంజంగి కొండలు

విశాఖ మన్యంలో శీతాకాలం శోభ సంతరించుకుంది. పర్యటక ప్రాంతం వంజంగి కొండలు పర్యటకులతో కిటకిటలాడుతోంది. గిరిజన గ్రామాల బాలికల థింసా నృత్యం ఆకట్టుకుంటోంది.

vizag agency tourist place
పర్యటకులతో కిటకిటలాడుతున్న వంజంగి కొండలు

By

Published : Oct 25, 2020, 8:13 PM IST

Updated : Oct 26, 2020, 3:07 PM IST

పర్యటకులతో కిటకిటలాడుతున్న వంజంగి కొండలు

విశాఖ మన్యంలో చలికాలం శోభ సంతరించుకుంది. దట్టమైన పొగమంచు వ్యాపించి చూపరులను కట్టిపడేస్తోంది. వంజంగి కొండలు పర్యటకులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జాము నుంచి మన్యంలో చలి గాలులు మొదలయ్యాయి.

పాడేరుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంజంగి కొండల మీదకు పర్యాటకులు అతి కష్టం మీద గంట ప్రయాణం చేసి చేరుకుంటున్నారు. ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదం పొందుతున్నారు. పరిసర గ్రామాలైన ఎస్. కొత్తూరు, కల్లాల బయలులో గిరిజన బాలికలు చేస్తున్న థింసా నృత్యం పర్యటకులను మరింత ఆకట్టుకుంటోంది.

Last Updated : Oct 26, 2020, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details