ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విత్తనాల కోసం అన్నదాతలు అష్టకష్టాలు

ఖరీఫ్ సీజన్ విత్తనాల కోసం అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. విక్రయ కేంద్రాల వద్ద పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వస్తోంది.

By

Published : Jun 18, 2019, 7:05 PM IST

రైతుల కష్టాలు

విత్తనాల కోసం అన్నదాతల.. అష్టకష్టాలు

విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో ఖరీఫ్ సీజన్ విత్తన విక్రయాలు స్థానిక పీఎసీఎస్​లో ప్రారంభించారు. అమ్మకాలు పద్ధతి ప్రకారం లేకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా బయోమెట్రిక్ విధానం మొబైల్ నెంబర్ నమోదు విధానం అవస్థలకు గురి చేస్తున్నాయి. దీనికితోడు తక్కువ విత్తనాలు రావడంతో వీటిని సకాలంలో పొందటానికి రైతులు ఎగబడుతున్నారు. ప్రధానంగా ఆర్​జీఎల్ వంటి రకాలకు రైతుల ప్రాధాన్యం ఇవ్వడంతో అవి దొరకడం కష్టం అవుతుంది. మండలానికి సంబంధించి 21 పంచాయతీల రైతులకు ఒకేసారి విక్రయాలు ప్రారంభించడంతో తోపులాట జరుగుతోంది. కొనుగోలుదారులు అంతా ఒకేసారి నిర్వాహకులపై ఒత్తిడి తేవడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి వారిని అదుపు చేయాల్సి వస్తోంది. విత్తనాలను పొందేందుకు అన్ని ప్రాంతాల నుంచి రైతులు, మహిళలు నిరీక్షిస్తున్నా.. అప్పటికీ సకాలంలో వారికి దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు. అధికారులపై మండి పడుతున్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సమయానికి విత్తనాలు వేయగలమో.. లేదోనని రైతులు మదన పడుతున్నారు. రోలుగుంట మండలానికి సంబంధించి ఆర్​జీఎల్ రకంతో పాటు సోనా మసూరి, సాంబ మసూరి, తరంగిణి, స్వర్ణ, శ్రీకాకుళం సన్నాలు తదితర రకాలు ప్రకటించినప్పటికీ ఈ ప్రాంత రైతులు అంతా కేవలం ఆర్​జీఎల్ మీదే మక్కువ చూపిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details