కొవిడ్ కారణంగా రద్దైన అరకు అద్దాల బోగీని పునరుద్ధరించినట్లు వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. శీతాకాలంలో అరకు అందాలు చూసేందుకు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తారని.. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
అరకు పర్యాటకులకు శుభవార్త..! - walther railway division
అరకు పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అద్దాల బోగీ ఈ నెల 18 నుంచి అందుబాటులోకి రానుంది. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు.

అరకు పర్యాటకులకు శుభవార్త..!
ఈనెల 18 నుంచి విశాఖ-కిరండల్ ప్రత్యేక ప్యాసింజర్ రైలుకు ఈ బోగీ అమర్చన్నారు. దీంతోపాటు స్లీపర్ క్లాస్ బోగీని కూడా జత చేయనున్నారు. గతంలో మాదిరిగానే హాల్ట్లను పునరుద్ధరించారు. ఇప్పటివరకు ఎస్.కోట, బొర్రా గుహల స్టేషన్లలో ఈ రైలు ఆగడం లేదు. ఇకపై ఈ స్టేషన్లలో కూడా రైలును నిలుపనున్నారు.
ఇదీ చదవండి: విశాఖలో 'రౌడీ బేబీ' షూటింగ్ ప్రారంభం