విశాఖ తెదేపా అధ్యక్షుడు, శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాజీమంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రాథమిక విచారణ కూడా జరపకుండానే అరెస్ట్ చేయటం వైకాపా కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమన్నారు.
కేవలం కక్ష సాధింపు కోసమే రవీంద్రను హత్య కేసులో ఇరికించారని ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇన్ని ఆరాచకాలు జరగలేదని, ఇంతమంది నేతలను జైళ్లకు పంపించలేదన్నారు. బీసీలపై వైకాపా పగ పట్టిందని చెప్పడానికి అచ్చెన్నాయుడు, యనమల, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసులే నిదర్శనమన్నారు.