ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ రామారావు మృతి - విశాఖ తెదేపా నాయకుడు మృతి

విశాఖ జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ తెదేపా సీనియర్ నేత బొడ్డేడ రామారావు (80) తుదిశ్వాస విడిచారు. ఆనారోగ్యంతో విశాఖలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈరోజు ఆయనకు స్వగ్రామం కె.జె.పురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

viskaha dst parishath ex chariemen died due to illhealth
viskaha dst parishath ex chariemen died due to illhealth

By

Published : Jul 25, 2020, 12:24 PM IST

విశాఖ జిల్లా మాడుగుల మండలం కె.జె.పురం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్, తెదేపా సీనియర్ నేత బొడ్డేడ రామారావు (80) శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన రాజకీయ జీవితం తొలినాళ్లలో కె.జె.పురం గ్రామ వార్డు సభ్యుడిగా మొదలైంది. గ్రామ సర్పంచిగా, మాడుగుల సమితి అధ్యక్షుడిగా.. విశాఖ జిల్లా పరిషత్ ఛైర్మన్, చోడవరం (గోవాడ) చక్కెర కర్మాగారం ఛైర్మన్ గా... అనేక పదవులు చేపట్టారు. శనివారం మాడుగుల మండలం కె.జె.పురం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details