విశాఖ సింహాద్రి ఎన్‌టీపీసీ 24వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. 1997 జూలై 8న ఎన్‌పీటీసీ సింహాద్రి ఫౌండేషన్ను ప్రారంభించారు. పరిపాలనా భవనం వద్ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. సుదర్శన్ బాబు జెండాను ఎగురవేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ఈ ఫౌండేషన్ ప్రారంభించినట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. ఈ ఫౌండేషన్ ద్వారా సాధించిన విజయాలు, భవిష్యత్ అవకాశాలను బృందానికి ఎలా బాధ్యతగా అప్పగించిందో వివరించారు. ప్రణాళికలు విజయవంతంగా అమలు చేయటం ద్వారా సామర్థ్యాన్ని నిరూపించిన అనుభవాలను గుర్తుచేశారు. ప్రతిష్టాత్మక స్వర్ణ శక్తి అవార్డు, భద్రతతో సహా స్టేషన్‌కు లభించిన ప్రశంసలను ఈడీ ప్రస్తావించారు.
విశాఖ సింహాద్రి ఎన్‌టీపీసీ ఫౌండేషన్ 24వ వార్షికోత్సవం - విశాఖ జిల్లా తాజా వార్తలు
విశాఖ సింహాద్రి ఎన్‌టీపీసీ ఫౌండేషన్ 24వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రారంభించనప్పటి నుంచి నేటి వరకు సింహాద్రి ఎన్‌టీపీసీ ద్వారా సాధించిన విజయాలను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. సుదర్శన్ బాబు గుర్తుచేశారు.
viskaha dst NPTC twenty years celebrations