ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కల్వర్టు కూలి ఐదేళ్లైంది.. ఎవరూ పట్టించుకోరా? - klavarter news in visakha

విశాఖ జిల్లా చోడవరం మండలం రాయపురాజుపేట వద్ద ఊటగెడ్డపై కల్వర్టు కూలి ఐదేళ్లైనా ఇప్పటికీ మరమ్మతు పనులు చేపట్టలేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు మండలాలకు చెందిన ప్రజలు ఈ కల్వర్ట్ మీదుగానే ప్రయాణం చేయాల్సి ఉంటుందని.. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

viskaha dst chodavarm mandla rayapurajupeta kalvarter
viskaha dst chodavarm mandla rayapurajupeta kalvarter

By

Published : Jul 16, 2020, 2:32 PM IST

విశాఖ జిల్లా చోడవరం మండలం రాయపురాజుపేట వద్ద ఊటగెడ్డపై ఉన్న కల్వర్టు.. 2015 నాటి భారీ వర్షాలకు కూలిపోయింది. ఆ తర్వాత చేపట్టిన తాత్కాలిక పనులు కూడా.. గెడ్డ ప్రవాహానికి దెబ్బతిన్నాయి. ఇక అధికారులు కానీ.. ఎన్నికైన ప్రజాప్రతినిధులు కానీ మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు తెలిపారు. రహదారి మార్గం లేక గ్రామస్థులే గెడ్డలో దారికి అనువుగా బాట చేసుకున్నారు.

చోడవరం, కె.కోటపాడు మండలాలకు చెందిన గ్రామస్థులు ఈ కల్వర్టు మీదుగా ప్రయాణించే వారు. పండించిన చెరకు గోవాడ చక్కెర కర్మగారానికి తరిలించేందుకు మార్గంగా ఉపయోగపడేది. కల్వర్టు పునరుద్ధరణ చేయని కారణంగా రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా.. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details