ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అప్పన్న సన్నిధిలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలి' - విశాఖ జిల్లా తాజా వార్తలు

సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ నాయకులు.. ఆలయ ఈవో సూర్యకళకు వినతిపత్రం అందజేశారు.

simhadri appanna temple at visakha
సింహాద్రి అప్పన్న సన్నిధి

By

Published : Apr 5, 2021, 4:20 PM IST

విశాఖలోని సింహాచలం అప్పన్న సన్నిధిలో ఉన్న ఆండాళ్ అమ్మవారి ఆభరణం బరువు తగ్గడంపై దర్యాప్తు చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పరిషత్ కార్యకర్తలు.. ఆలయ ఈవో సూర్యకళకు వినతిపత్రం అందజేశారు. దేవస్థానానికి సంబంధించిన స్థలాల్లో భూ కబ్జాలు పెరిగిపోయాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆలయంలో జరుగుతున్న అక్రమాలను గుర్తించి.. తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు.. అమ్మవారి ఆభరణం బరువు తగ్గిందని వస్తున్న ఆరోపణలను ఈవో సూర్యకళ ఖండించారు. తానే స్వయంగా తనిఖీలు చేశానని చెప్పారు. అమ్మవారి ఆభరణం విరిగిన భాగంలో మరమ్మతులు చేసి అర్చకులు అమ్మవారికి అలంకరించారని స్పష్టం చేశారు. ఆ ఆభరణం బరువులో ఏలాంటి మార్పు లేదని మీడియాకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details