ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పన్న స్వామి చందనోత్సవం చరుగ్గా ఏర్పాట్లు - simahachalam appanna

అక్షయ తృతీయ రోజు సింహాచలం అప్పన్న స్వామి జరిగే చందనోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు చేపడుతున్నామని విశాఖ సీపీ మహేష్ చంద్రలడ్డా తెలిపారు. ఆ రోజు జరిగే ఏర్పాట్ల పనులను సీపీ పరిశీలించారు.

అప్పన్న స్వామి చందనోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన విశాఖ సీపీ

By

Published : May 3, 2019, 9:45 AM IST

విశాఖ సింహచలంలో ఈ నెల 7న అక్షర తృతీయనాడు జరిగే చందనోత్సవం ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ మహేష్ పరిశీలించారు. ముందుగా అప్పన్న స్వామిని దర్శించుకున్న సీపీ చంద్రలడ్డా... అనంతరం దేవస్థానం ఈవోతో కలిసి క్యూలైన్ల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 1600 పోలిస్ సిబ్బందిని విధుల్లో ఉంచుతున్నట్లు వెల్లడించారు. దాదాపు 60 శాతం పనులు పూర్తి అయ్యాయని ఫొని తుఫాను ప్రభావం తగ్గిన వెంటనే మిగతా పనులు ప్రారంభిస్తామన్నారు.

అప్పన్న స్వామి చందనోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన విశాఖ సీపీ

ABOUT THE AUTHOR

...view details